

మామయ్య.....నాకు తెలిసిన అతికొద్ది మంది అంకితభావం గల ప్రభుత్వోద్యుగుల్లో మీరు ఒకరవ్వడం మా అదృష్టం. అయిదు పదుల వయసులో కూడా కంప్యూటర్ నేర్చుకోవడం , కాలం తో పోటీపడి ఆధునిక సాంకేతికత ఆలవర్చుకోవడం లాంటి మీ లక్షణం ఈ కాలం యువతారానికి ఆదర్శం.. ఈ 39న్నర యెళ్ళలొ 8 తపాల కార్యాలయాల్లో మీ చేత రాయబడ్డ వందల రెజిస్టర్ పుస్తకాలు, బట్వాడా చేపించబడ్డ వేల ఉత్టరాలు మీ శ్రమ కి మూగ నిదర్శనాలు.. ఏమీ సదుపాయాలు లేని ప్రభుత్వ భవనాల్లో , సరిగ్గా కరంట్ కూడా లేని రోజుల్లో, మండు వేసవిలో, కుండపోత వానలో కూడా మీరు ఉద్యోగ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించడం మేం మా పిల్లలకి సగర్వం గా చెప్పుకోదగ్గ ఉదాహరణలు.. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకి వత్హిడి నివ్వడం సర్వసాధారణం అయినా మీ విషయం లో ఆది తప్పు అని రుజువు చేశాయి మీకు పని వత్హిడి వల్ల కలిగిన దుష్ప్రయోజనాలు ..మధుమేహం లాంటివి.. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీ కుర్చికి సగ జీవిత సమయాన్నిపంచుకొని, అనుక్షణం మీకు తోడు ఉండి, మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడిన అత్హయ్య కూడా మీ ఈ విజయంలో భాగమే... మీరు జీవితంలో ఈ రెండో ఆధ్యాయాన్ని మరింతగా ఆస్వాదించాలని కోరుకుంటూ.. మీ కుటుంబ సభ్యులు...